బెంగాల్ బిజెపిలో పెను కుదుపు ఏర్పడింది. అధికార టిఎంసి పార్టీలోకి ఇద్దరు కమలం ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. దీంతో బిజెపి తన బలాన్ని 70కు కోల్పోయింది. 2019 ఎన్నికలకు ముందు టిఎంసిని వీడి బిజెపి తీర్థం పుచ్చుకున్ని అర్జున్ సింగ్, అతడి కొడుకు పవన్ కుమార్ సింగ్‌లు తిరిగి మమత పార్టీలోకి చేరిపోయారు. పవన్ భాత్పరా అసెంబ్లీ నుంచి బిజెపి టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందగా.. అర్జున్ సింగ్ బర్రాక్పోర్ స్థానం నుంచి ఎంపిగా కొనసాగుతున్నారు.