గుజరాత్​ : 89 శాతం బిజెపి అభ్యర్థులు కోటీశ్వరులే

By udayam on November 25th / 9:13 am IST

గుజరాత్‌ మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్నబిజెపి అభ్యర్థుల్లో 89 శాతం మంది కోటీశ్వరులేనని ఓ నివేదిక పేర్కొంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కోటీశ్వరుల సంఖ్య పెరిగిందని తెలిపింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ (ఎడిఆర్‌) గురువారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి సగటు ఆస్తి విలువ రూ.13.4 కోట్లుగా పేర్కొంది. రూ.175.78 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థి రమేష్‌ తిలాలా రాజ్‌కోట్‌ సౌత్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపింది. రూ.162 కోట్లతో రెండో సంపన్న అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ఇంద్రనీల్‌ రాజ్‌గురు రాజ్‌కోట్‌ ఈస్ట్‌ నుండి పోటీ చేస్తున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​