మళ్ళీ RX 100 కాంబినేషన్​!

By udayam on January 11th / 6:30 am IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై, సంచలన విజయం సాధించిన సినిమాలలో “RX 100” ఒకటి. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా కొత్తదర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుండి మంచి రివ్యూలను అందుకుంది. ఈ నేపథ్యంలో తనకు ఫస్ట్ సూపర్ హిట్ అందించిన కార్తికేయతోనే అజయ్ తన నెక్స్ట్ మూవీని చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదొక తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోతుందట. RX 100 బ్లాక్ బస్టర్ తో కార్తికేయ, పాయల్ వరసపెట్టి సినిమాలను చేస్తున్నారు.

ట్యాగ్స్​