బంగ్లాదేశ్ లోని రోహింగ్యా క్యాంపుల నుంచి చిన్న బోటులో తప్పించుకున్న 160 మంది శరణార్ధులు వారాల తరబడి సముద్రంలో చిక్కుకుపోయారని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీరిని మానవతా దృక్పథంతో తమ దేశాల్లోకి రానివ్వాలని ఏసియాన్ దేశాలైన భారత్ తో సహా ఇండోనేషియా, థాయిలాండ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. వీరంతా రెండు వారాల నుంచి ఇలా సముద్రంలోనే చిన్న బోటులో థాయిలాండ్, మలేషియా, ఇండియా, ఇండోనేషియా తీరాలకు వచ్చి వెనక్కి వెళ్తున్నారని తెలిపింది.