పాకిస్థాన్​లో బాంబు పేలుళ్ళు.. 8 మంది చిన్నారులు మృతి

By udayam on October 28th / 6:52 am IST

పాకిస్తాన్‌లో మంగళవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 8 మంది చిన్నారులు మృతి చెందగా, 120 మంది గాయపడ్డారు. పెషావర్‌లోని డిర్‌ కాలనీలో ఒక మత పాఠశాల వద్ద ఉదయం ప్రార్ధనల అనంతరం ఈ ఘటన జరిగింది. పేలుడులో 4 నుంచి 5 కిలోల పేలుడు పదార్ధాలు వినియోగించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఖైబర్‌ పక్తున్‌క్వా ముఖ్యమంత్రి మెహ్మద్‌ఖాన్‌ ఖండించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు బ్లాస్ట్… ముగ్గురి మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలోని జబుల్​ ప్రావిన్స్​ షింకాయ్​ జిల్లాలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు పేలుడుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నాయి.