అమెరికా: బాంబ్​ సైక్లోన్​ ధాటికి 34 మంది మృతి

By udayam on December 26th / 6:37 am IST

అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న ‘బాంబు సైక్లోన్​’ దెబ్బకు అక్కడ 34 మంది పౌరులు మరణించారు. ఇళ్ల చుట్టూ కొండలా పేరుకుపోతున్న మంచుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచు ధారాళంగా కురుస్తోంది. తుపాను వచ్చినప్పుడు దాని వాతావరణ పీడనం కనిష్ఠ స్థాయికి పడిపోతే ఆ తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా వ్యవహరిస్తారు. గ్రేట్‌లేక్స్ ప్రాంతంలో ఇది ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​