చార్మినార్‌ వద్ద బాంబు బెదిరింపు.. బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు

By udayam on November 21st / 12:34 pm IST

హైదరాబాదులోని చారిత్రక కట్టడం చార్మినార్‌ వద్ద బాంబు కలకలం రేగింది. చార్మినార్‌ వద్ద బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి పోలీసులకు ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్‌ వద్ద, పరిసర ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్‌ చుట్టుపక్కల దుకాణాలు, హౌటళ్లలో తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేకపోవడంతో అది ఫేక్‌ కాల్‌ అని నిర్ధారించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల కాల్‌ అయ్యుంటుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్​