కొచ్చర్​ దంపతులకు బెయిల్​

By udayam on January 10th / 5:55 am IST

వీడియోకాన్‌ గ్రూపు ఛైర్మన్‌తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్దంగా ఆ సంస్థకు భారీగా రుణాలిచ్చిన క్విడ్‌ప్రోకో కేసులో అరెస్ట్‌ అయినా ఐసిఐసిఐ బ్యాంక్‌ సిఇఒ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు బెయిల్‌ లభించింది. బాంబే హైకోర్టు సోమవారం కొచ్చర్‌ దంపతులకు బెయిల్‌ను మంజూరు చేసింది. వారిని జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చట్టానికి అనుగుణంగా కొచ్చర్‌ దంపతుల అరెస్టు జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. 2022 డిసెంబరు 23న కొచ్చర్‌ దంపతులను సిబిఐ అరెస్ట్‌ చేయగా.. సిబిఐ న్యాయస్థానం జ్యుడిషీయల్‌ కస్టడీ విధించింది.

ట్యాగ్స్​