ఢిల్లీ మర్డర్​: ఆ ఎముకల్లో శ్రద్ధా డిఎన్​ఏ

By udayam on December 15th / 9:09 am IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్​ హత్య కేసులో కీలక ఆధారాలను పోలీసులు సంపాదించారు. మెహ్రాలి అటవీ ప్రాంతంలో 20 రోజుల క్రితం దొరికిన ఎముకల్లోని డిఎన్​ఎ శ్రద్ధా తండ్రి డిఎన్​ఎ తో సరిపోతుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో శ్రద్ధావిగా అనుమానిస్తున్న మొత్తం 13 ఎముకలను పోలీసులు సంపాదించారు. ఈ ఏడాది జూన్​ లో శ్రద్ధా ను అతడి ప్రియుడు అఫ్తాబ్​ పూనావాలా 35 భాగాలుగా నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ శరీర భాగాలను దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో పారేశాడు.

ట్యాగ్స్​