వాట్సాప్​ ద్వారా హైదరాబాద్​ మెట్రో టికెట్​

By udayam on October 4th / 6:59 am IST

దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సాప్‌ ద్వారా మెట్రో ప్రయాణానికి సంబంధించిన టికెట్‌ను బుకింగ్‌ చేసుకునే సేవలను సోమవారం ఎల్​అండ్​టి మెట్రో తీసుకొచ్చింది. హైదరాబాద్​ మెట్రో రైల్​ సీఈఓ, ఎండి కెవిబి రెడ్డి ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సేవలను అందించేందుకే వాట్సాప్‌ టికెటింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. బిల్‌ ఈజీ సంస్థ భాగస్వామ్యంతో వాట్సాప్‌ ద్వారా మెట్రో ప్రయాణికులు టిక్కెట్లను బుకింగ్‌ చేసుకునేలా సేవలను ప్రారంభించామని తెలిపారు.

ట్యాగ్స్​