ఈ ఏడాది తమ ప్లాట్ ఫాంలో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల లిస్ట్ ను విడుదల చేసిన బుక్ మై షో యాప్. ఈ లిస్ట్ లో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్–2 తొలి స్థానంలో నిలిచింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు రెండో స్థానం దక్కగా.. రిషబ్ శెట్టి మూవీ కాంతారాకు మూడో స్థానం దక్కింది. వీటి తర్వాత ది కశ్మీర్ ఫైల్స్, పొన్నియెన్ సెల్వన్–1, లు 4, 5 స్థానాల్లో నిలిచాయి. 5–10 స్థానాల్లో బ్రహ్మాస్త్ర, విక్రమ్, దృశ్యం–2, భూల్ భులైయా 2, డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రాలు నిలిచాయి.