మీడియా చూసి పరుగెట్టిన ఏక్​నాథ్​ షిండే

By udayam on June 22nd / 12:40 pm IST

మహారాష్ట్రలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గుజరాత్​లోని సూరత్​ విమానాశ్రయంలో మీడియా కంట పడ్డారు. దీంతో వారంతా ప్రెస్​ను తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి పరుగులు పెట్టిన వీడియో వైరల్​ అవుతోంది. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి ఏక్​నాథ్​ షిండే సైతం వీరిలో ఉన్నారు. వీరంతా సూరత్​ నుంచి అస్సాంకు బయల్దేరి వెళ్తుండగా ఎన్​డిటివి రిపోర్టర్​ వీడియో తీశారు. పరిగెడుతూనే ఉన్న ఓ ఎమ్మెల్యే తమకే మెజారిటీ ఉందని చెప్పడం వీడియోలో రికార్డ్​ అయింది.

ట్యాగ్స్​