మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చింది. “నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో… బాస్ వస్తుండు, బాస్ వస్తుండు” అంటూ పక్కా మాస్ డైలాగ్స్ తో ఈ సాగ్ రానుంది. దేవి శ్రీ నే రాసిన ఈ పాటను ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆలపించారు ఈ పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ సరసన తళుక్కుమన్నట్టు తెలుస్తోంది.
#Bossparty మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్య నుంచి ‘బాస్ పార్టీ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @UrvashiRautela @ThisIsDSP @MythriOfficial #Mega154 #Megastar pic.twitter.com/YalieJooVh
— Udayam News Telugu (@udayam_official) November 22, 2022