పన్నీర్​ సెల్వంపైకి వాటర్​ బాటళ్ళు

By udayam on June 23rd / 10:03 am IST

తమిళనాడులో జరుగుతున్న ప్రతిపక్ష అన్నాడిఎంకె జనరల్​ కౌన్సిల్​ సమావేశంలో రసాభాస ఏర్పడింది. ఆ పార్టీ కో ఆర్డినేటర్​గా ఉన్న పన్నీర్​ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు మంచినీళ్ళ బాటిళ్ళను విసిరి నిరసనను వ్యక్తం చేశారు. మీటింగ్​ను బాయ్​కాట్​ చేసి ఆయన బయటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో పన్నీర్ సెల్వంతోపాటు ఎడప్పాడి కె.పళనిస్వామి సూచించిన 23 ప్రతిపాదనలను జనరల్ కౌన్సిల్ తిరస్కరించింది. పార్టీ ఒకరి నాయకత్వంలోనే ఉండాలన్నది తమ కోరికని జనరల్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్​