అల్లు అర్జున్ పుష్ప హుక్ స్టెప్‌ను విండీస్ ఆల్‌రౌండర్ బ్రావో అనుకరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న ఈ కరేబియన్ ప్లేయర్ పుష్ప ట్రెండ్‌ను అక్కడ కూడా కొనసాగిస్తున్నాడు. మెహిదుల్ ఇస్లాం అంకోన్ వికెట్ తీసిన అనంతరం మైదానంలో బ్రావో పుష్ప స్టెప్‌ను వేస్తూ కనిపించడం భారత్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీలో స్టెప్లను భారత క్రికెటర్లు సురేష్ రైనా, జడేజాలతో పాటు ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా ట్రై చేశాడు.