మరో 2 వారాలు ఐసియులోనే గాన కోకిల

By udayam on January 12th / 10:18 am IST

సీనియర్​ గాయకురాలు, నైటింగేల్​ ఆఫ్​ ఇండియా లతా మంగేష్కర్​ ఆరోగ్యంపై బ్రీచ్​ కాండీ ఆసుపత్రి వైద్యులు హెల్త్​బులిటెన్​ విడుదల చేశారు. మరిన్ని రోజులు ఆమెను ఐసియులోనూ ఉంచి చికిత్స అందించనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు ఆమెకు కొవిడ్​తో పాటు న్యూమోనియా కూడా ఉందన్నారు. పెద్ద వయసు కాబట్టే ముందు జాగ్రత్తగా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు లతా మంగేష్కర్​ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్​