ఇష్టం లేని పెళ్ళని.. గన్నేరుపప్పు తిని..

By udayam on May 13th / 4:48 am IST

ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారన్న కోపంతో ఓ మహిళ గన్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని మధురవాడలో చోటు చేసుకుంది. దీంతో ఆ మహిళ పెళ్ళి పీటలపైనే కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా అక్కడ డాక్టర్లు ఆమెను కాపాడలేకపోయారు. ఆమె స్నేహితులను విచారించిన పోలీసులు.. ఈ పెళ్ళి ఆమెకు ఇష్టం లేదని తెలుసుకున్నారు. దీంతో ఆమె హ్యాండ్​ బ్యాగ్​ను తనిఖీ చేయగా.. గన్నేరుపప్పును పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్​