ఓ నవ వధువు తన తండ్రి ఫొటోను చేత పట్టుకుని పెళ్ళి పీటలపైకి వచ్చిన పిక్ నెట్లో వైరల్‌గా మారింది. ‘నా తండ్రే నాకు సర్వస్వం. మేమిద్దరం ఓ టిమ్గా ఉండే వాళ్ళం. ఆయనే నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు స్విమ్మింగ్, గాలిపటం ఎగరేయడం కూడా ఆయన నేర్పినవే.. నా లిమిట్స్‌ను ఫుష్ చేయమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు’ అని 19 ఏళ్ళ ఛయ్యా భజంక చెప్పింది. గతేడాది ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన లేరన్న నిజం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.