బీహార్లోని బెగుసరాయ్ లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. రూ.13 కోట్లతో నాబార్డ్ పథకం కింద దీనిని నిర్మించారు. అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చౌకి, బిషన్‌పూర్ మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జి 2017లోనే పూర్తయినప్పటికీ ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గత నెలలోనూ బీహార్ లోనినలంద జిల్లాలో నిర్మాణంలో ఓ వంతెన కూలి ఓ కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే.