బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటనున్నాయి. మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఆ దేశ రాజధాని లండన్, మాంచెస్టర్, యార్క్ సిటీల్లో రెడ్ జోన్‌గా ప్రటకించారు. 2019లో బ్రిటన్‌లో వచ్చిన 38.7 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతే ఇప్పటివరకూ అత్యధికం. నిన్న సోమవారం నాడు దీనికి సమీపంగా 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌లో చాలా ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఉంటుందని అధికారులు తెలిపారు.