బ్రిటన్​ తొలి అంతరిక్ష ప్రయోగం ఫెయిల్​

By udayam on January 11th / 7:09 am IST

బ్రిటన్‌ సొంత గడ్డపై నుంచి సోమవారం అర్ధరాత్రి చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విఫలమైంది. షెడ్యూలు ప్రకారం..న్యూక్వే విమానశ్రయంలోని కార్న్‌వాల్‌ స్పేస్‌పోర్టు నుంచి 70 అడుగులు (21 మీ) పొడవున్న ఈ వ్యోమనౌకను ప్రత్యేకమైన వర్జిన్‌ ఆర్బిట్‌ అట్లాంటిక్‌ బోయింగ్‌ 747 విమానం సాయంతో 10,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి దాని ఇంజిన్లను మండించి అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించారు. అయితే రాకెట్​ 10 వేల మీటర్లకు చేరిన తర్వత సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో భూ కక్ష్యలోకి చేరుకోవడం విఫలమైంది. ఈ రాకెట్‌లో తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నట్లు ది గార్డియన్‌ పత్రిక పేర్కొంది.

ట్యాగ్స్​