ఆక్వేరియాల్లో పెంచుకునే చిన్న చిన్న గోల్డ్ ఫిష్ లంటే మనకు ఎంతో ఇష్టం. కానీ ఇదే గోల్డ్ ఫిష్ ఓ 30 కేజీలు ఉంటే.. వామ్మో అనాల్సిందే. ఫ్రాన్స్ లోని బ్లూ వాటర్ లేక్స్ లో ఓ జాలరి వేసిన గేలంలో ఇలాంటి ఓ భారీ గోల్డ్ ఫిష్ చిక్కింది. దానిని చూసిన అతడు ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనిని ఆ ప్రాంతంలో క్యారెట్ అని పిలుస్తారు. ఇంత పెద్ద గోల్డ్ ఫిష్ ను ఈ ప్రాంతంలో చూడడం ఇదే తొలిసారి అని జాలరి చెప్పుకొచ్చాడు.