ఉయ్యాలూగుతూ గిన్నీస్​ బుక్​లోకి

By udayam on May 23rd / 12:18 pm IST

బ్రిటన్​కు చెందిన రిచర్డ్​ స్కాట్​ అనే వ్యక్తి ఉయ్యాలపై ఏకంగా 36 గంటల పాటు ఊగుతూ సరికొత్త ప్రపంచ రికార్డ్​ను నెలకొల్పాడు. 51 ఏళ్ళ స్కాట్​ శనివారం ఉదయం 6.10 గంటలకు మొదలెట్టిన ఉయ్యాలటను ఆదివారం సాయంత్రం ముగించాడు. దీంతో అతడి పేరిట సరికొత్త రికార్డ్​ నమోదైంది. ఈ క్రమంలో ప్రతీ గంటలకు అతడు 5 నిమిషాల పాటు బ్రేక్​ తీసుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి 3 గంటలకు ఊగుతూనే నిద్రపోయిన అతడు 2020లో నమోదైన 34 గంటల నిరంతర ఉయ్యాల రికార్డ్​ను బ్రేక్​ చేశాడు.

ట్యాగ్స్​