బ్రదర్​ అనిల్​: ఏపీలో పుట్టకుండా ఉండాల్సింది

By udayam on December 16th / 6:41 am IST

ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో పుట్టి ఉంటే బాగుంటుందని ఎపి వాసులు భావిస్తున్నారని బ్రదర్​ అనిల్​ కుమార్​ చేసిన వ్యాఖ్యలు వైరల్​ గా మారాయి. ఏపీ సిఎం వైఎస్​ జగన్​ కు బావ, షర్మిలకు భర్త అయిన అనిల్​ కుమార్​ విశాఖ లోని భీమిలో జరిగిన క్రైస్ట్​ కేర్​ అండ్​ క్యూర్​ మినిస్ట్రీస్​ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దని ప్రజలకు సూచించారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని అన్నారు.

ట్యాగ్స్​