5 రెట్లు పెరిగిన కేసీఆర్​ పార్టీ ఆదాయం

By udayam on December 27th / 11:08 am IST

టిఆర్​ఎస్​ ను భారత రాష్ట్ర సమితిగా ఇటీవలే మార్చిన కేసీఆర్​.. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా చందాల రూపంలో భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. గతేడాది మార్చి 31 నాటికి ఈ పార్టీ ఆదాయం రూ.37.65 కోట్లు ఉండగా.. ఒక్క ఏడాదిలోనే ఆ మొత్తం రూ.218.11 కోట్లకు చేరింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏకంగా రూ. 153 కోట్లు, ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ. 40 కోట్లు, ఇతర ఆదాయాల రూపంలో రూ. 16 కోట్లు రాగా.. రూ.27.93 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంది. దాంతో, తమ తాజా ఆస్తుల విలువ రూ. 480.75 కోట్లకు చేరుకుందని వివరించింది.

ట్యాగ్స్​