బిఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి

By udayam on December 26th / 12:30 pm IST

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తుపట్ల నమ్మకం లేదని బిజెపి, నిందితులు దాఖలు పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం సిట్‌ విచారణ నిలిపివేతకు ఆదేశిస్తూ.. కేసును సిట్‌ నుంచి సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలు సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

ట్యాగ్స్​