కల్వకుంట్ల కవిత: నా నిజాయితీని కాలమే చెబుతుంది

By udayam on December 22nd / 5:02 am IST

ఢిల్లీ లిక్కర్ కేసులో తన మీద వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవమని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘నా మీద చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నా నిజాయితీని కాలమే నిరూపిస్తుంది. బీజేపీ వాళ్ల రైతు వ్యతిరేక విధానాలను, పెట్టుబడిదారుల అనుకూల పద్ధతులను బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ బయట పెడుతున్నందుకు రాజకీయ కక్షలో భాగంగా వారు ఇలా చేస్తున్నారు’ అని కాంగ్రెస్ నేత మాణిక్కమ్ ఠాగూర్‌‌ను ట్యాగ్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు.

ట్యాగ్స్​