భారత రాష్ట్ర సమితిని మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ గట్టిగా నిలబెట్టేందుకు కేసీఆర్ ముమ్మర ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడిని నియమించిన ఆయన ఇప్పుడు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో కనీసం 20 చోట్ల ఎమ్మెల్యేలను, 4–5 చోట్ల ఏంపీ లను పోటీకి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఐపాక్ సంస్థతో కలిసి ఏపీలోని.. తెలంగాణకు సరిహద్దులుగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.