కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు అత్యంత చవకైన డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.87తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జిబి డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందించనుంది. దీంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా వినియోగదారులు పంపించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్‌నే దేశంలో అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్‌గా జాతీయ మీడియా పేర్కొంటోంది.