ప్రభుత్వ ఉద్యోగులకు బిఎస్​ఎన్​ఎల్​ బంపరాఫర్​

By udayam on January 19th / 10:38 am IST

భారత సంచార్​ నిగమ్​ లిమిటెడ్​ (బిఎస్​ఎన్​ఎల్​) దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ తమ నెట్​వర్క్​ ద్వారా చేసే ఫోన్​ కాల్స్​ ధరల్లో 10 శాతం డిస్కౌంట్​ను ప్రకటించింది.

ఈ పదిశాతం డిస్కౌంట్​ను ఉద్యోగులు వాడే బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్​లో కానీ, ఫైబర్​ టు ది హోమ్​, ల్యాండ్​లైన్​ విషయంలో కానీ పొందే అవకాశాన్ని బిఎస్​ఎన్​ఎల్​ కల్పిస్తోంది.

ఇప్పటికే మార్కెట్​లో పోటీని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న బిఎస్​ఎన్​ఎల్​ సరికొత్త పథకాలతో వినియోగదారులను పెంచుకోవాలని ప్రయత్నాలు చేపట్టిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే ఈ సరికొత్త పథకాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.