వచ్చే ఏడాదిలో బిఎస్​ఎన్​ఎల్​ 5జి సేవలు

By udayam on December 28th / 8:00 am IST

వచ్చే ఏడాది నుంచి భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (బిఎస్​ఎన్​ఎల్​) ద్వారా 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర కమ్యూనియేషన్​ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.అదే విధంగా రానున్న రెండు నుంచి మూడేళ్లలో దేశవ్యాప్తంగా 80 శాతం మేరకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని 50 నగరాల్లో వివిధ టెలికాం సంస్థలు తమ 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చాయన్న ఆయన 5జీ సేవలతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, లాజిస్టిక్ రంగాల్లో వినూత్న మార్పులు చోటుచేసుకుంటాయని వివరించారు.

ట్యాగ్స్​