బిల్​ కట్టలేదని ఇంటిని కూల్చేశాడు

By udayam on June 9th / 11:22 am IST

తనకు రావాల్సిన డబ్బును చెల్లించడం లేదన్న ఉక్రోషంతో అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటిని నేలమట్టం చేశాడు ఓ బిల్డర్​. ఇంగ్లాండ్​లోని స్టోనీగేట్​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఇంటి నిర్మాణం కోసం తాను ఖర్చుపెట్టిన దాంట్లో ఇంకా రూ.3.61 లక్షలు పెండింగ్​ బిల్​ ఉందని బిల్డర్​.. ఇంటి యజమానితో గొడవ పడ్డాడు. అయితే అంత మొత్తాన్ని తాను కట్టనని ఏం చేస్తావో చేసుకో అంటూ అతడు తన ఫ్యామిలీతో సహా వీకెండ్​ ట్రిప్​కు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన బిల్డర్​ ఆ ఇంటిని దాదాపుగా కూల్చేశాడు. దీంతో ఇప్పుడు ఇరు వర్గాలు పోలీసుల వద్ద కూర్చున్నారు.

ట్యాగ్స్​