విమానంపైకి కాల్పులు.. గాయపడ్డ ప్రయాణికుడు

By udayam on October 3rd / 5:48 am IST

సైనిక గుప్పిట్లో ఉన్న మయన్మార్​ లో షాకింగ్​ ఘటన చోటు చేసుకుంది. 3500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఓ విమానంపైకి కాల్పులు జరపడంతో అందులో ఉన్న ఓ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమయంలో విమానం లోయికావ్​ విమానాశ్రయానికి కేవలం 4 మైళ్ళ దూరంలోనే ఉంది. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుడికి ఫస్ట్​ ఎయిడ్​ జరిపి విమానాన్ని లోయికావ్​ విమానాశ్రయంలో దించేశారు. తక్షణం గాయపడ్డ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. కరెన్ని నేషనల్​ ప్రోగ్రెసివ్​ పార్టీకి చెందిన వారే ఈ కాల్పులకు పాల్పడ్డట్టు సైన్యం ప్రకటించింది.

ట్యాగ్స్​