షమి, బుమ్రాలంటే భయం లేదు

స్టార్క్​, హేజిల్​వుడ్​, కమిన్స్​లు మాకూ ఉన్నారు: అలెక్స్​ కేరే

By udayam on November 21st / 7:20 am IST

ఆస్ట్రేలియా – భారత్​ సిరీస్​కు ముందు మాటల యుద్దాలు మొదలైనట్లే ఉన్నాయి. ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​ అలెక్స్​ కేరే భారత ఫాస్ట్​ బౌలర్లైన షమి, బుమ్రాలంటే తమకేం భయం లేదని, తమ వద్ద స్టార్క్​, హేజిల్​ వుడ్​, కమిన్స్​ వంటి భయంకర బౌలర్లు ఉన్నారని వ్యాఖ్యానించాడు.

‘‘భారత్​ షమి, బుమ్రాలు మంచి బౌలర్లను కలిగి ఉంది. అయితే మా వద్ద వారికంటే క్వాలిటీ బౌలర్లైన స్టార్క్​, హేజిల్​ వుడ్​, కమిన్స్​లు ఉన్నారు. అది వారు గుర్తుంచుకోవాలి” అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

అక్టోబర్​ 27 నుంచి మొదలవనున్న ఈ సిరీస్​కు ఇప్పటికే ఇరు జట్లు ఆస్ట్రేలియాలోని అడిలైడ్​ చేరుకుని ప్రాక్టీస్​ సెషన్లు ప్రారంభించాయి.

డేవిడ్​ వార్న్​, ఆరోన్​ ఫిచ్​ వంటి టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ ఇప్పటికే భారత బౌలర్లైన షమి, బుమ్రాలను ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే వారి వద్ద ఛాహల్​, జడేజా వంటి బౌలర్లకు మా వద్ద ఉన్న ప్యాట్​ కమిన్స్​, మిచెల్​ స్టార్క్​, ఆడం జంపా, జోష్​ హేజిల్​వుడ్​లు సరిగ్గా సరిపోతారు అని వ్యాఖ్యానించాడు.