బస్సులో మంటలు.. నలుగురు మృతి

By udayam on May 14th / 5:58 am IST

వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో బయల్దేరిన ఓ ప్రయాణికుల బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులోని నలుగురు దుర్మరణం చెందగా 20 మందికి గాయాలయ్యాయి. వీరంతా జమ్మూలోని కత్రా నుంచి బయల్దేరారు. బస్సు నొమాయి వద్దకు చేరుకోగానే బస్సులో మంటలు వ్యాపించాయని జమ్మూ అడిషనల్​ డిజి ముకేష్​ సింగ్​ తెలిపారు. ప్రమాదానికి అసలు కారణాలను గాలిస్తున్నామన్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురికి ప్రత్యేక చికిత్స అవసరమని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​