డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడ్డ ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్రికెటర్ రిషబ్ పంత్ ను ఓ బస్సు డ్రైవర్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. లేకపోతే మంటలు వ్యాపించిన కారులోంచి పంత్ బయట పడడం కష్టమైపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ కు ఢీకొని పల్టీలు కొట్టింది. హర్యానా రోడ్ వేస్ కు చెందిన బస్ డ్రైవర్ సుశీల్ మాన్ యాక్సిడెంట్ ను గమనించి బస్సును పక్కన ఆపి కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు కిటికీ నుంచి పంత్ ను బయటకు లాగేశాడు. తాను క్రికెటర్ ను అని, తన తల్లికి కాల్ చేయమని అతడు నాతో అన్నట్లు చెప్పిన సుశీల్.. క్రికెట్ చూడడని.. మీరెవరో తనకు తెలియదని పంత్ కు బదులిచ్చినట్లు పేర్కొన్నాడు.