కేంద్ర మంత్రివర్గంలో మరోసారి మార్పులు చేర్పులు జరగనున్నట్లు ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని మంత్రిమండలిని వచ్చే నెల 14న విస్తరించనున్నట్లు తెలుస్తోంది. 2024 సాధారణ ఎన్నికల ముందు కుల రాజకీయాల సమీకరణలో భాగంగా ఈ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు ముందే ఈ విస్తరణ జరపాలని ప్రధాని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంతో పాటు పలు రాష్ట్రాల్లోని బిజెపి అగ్రనాయకత్వాన్ని కూడా మార్చాలని చూస్తున్నారట.