కేరళ సిఎం: సిఎఎ ను అమలు చేసేదేలే

By udayam on June 3rd / 7:19 am IST

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను తమ రాష్ట్రంలో ఎప్పటికీ అమలు చేసేది లేదని కేరళ సిఎం పినరయి విజయన్​ పేర్కొన్నారు. ‘ఈ విషయంలో మేం పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివాదాస్పద చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేసేది లేదు. ప్రస్తుతం దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకూ భంగం వాటిల్లడమే’ అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్​