రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ)ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మందలించింది. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ లక్ష్యాలు, ప్రామాణికాలను సాధించలేకపోయినప్పటికీ ఆ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని ప్రకటిస్తూ, వాటిని ఒక పద్ధతి లేకుండా క్లోజ్ చేస్తున్నారని డిఆర్‌డిఒను కాగ్ విమర్శించింది. పైగా ప్రాజెక్టుల పూర్తికి పట్టే సమయం, అయ్యే ఖర్చు రెండూ విపరీతంగా పెరిగిపోతున్నాయని పేర్కొంది.మొత్తంగా 178 ప్రాజెక్టులకుగానూ 119 ప్రాజెక్టుల్లో ముందుగా పేర్కొను కాలపరిమితికి కట్టుబడలేదని కాగ్ బయటపెట్టింది.