కాలి బూడిదైన సూపర్​ రిచ్​ విల్లాలు

By udayam on May 17th / 9:57 am IST

అమెరికాలోనే అత్యంత ధనవంతులకు చెందిన 20 సూపర్​ రిచ్​ విల్లాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాలిఫోర్నియాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన ఈ మిలియన్​ డాలర్ల ఇళ్లులు వాతావరణ మార్పుల కారణంగా కాలిఫోర్నియా అడవుల్లో తలెత్తిన ఈ మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపు 100 ఇళ్ళ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.. 20 ఇళ్ళు పూర్తిగా కాలిపోయాయని ప్రకటించారు. ఇందులోని అత్యంత విలాసవంతమైన వస్తువులను యజమానులు కార్లలో వేరే చోటకి తరలించారు.

ట్యాగ్స్​