అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీని మీరు ఇప్పటి వరకూ చూడలేదా! అయితే మీరు ఓ 10 నిమిషాల సీన్లను మిస్ అయిపోయినట్లే! ఎందుకంటే ఈ మూవీలో వచ్చే పలు యాక్షన్ సీక్వెన్స్ లో రక్తపాతం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయని భావించిన డైరెక్టర్ కేమరూన్ ఆ సీన్లకు కోత పెట్టేశాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. హింస, యాక్షన్ సీన్లను బాలెన్స్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన అతడు ‘ఇప్పుడు నా మానసిక సంఘర్షణ తగ్గింది’ అంటూ చెప్పుకొచ్చాడు.