అమ్మాయిలు రుతు క్రమం సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్ లో ప్రమాదకర కెమికల్స్ ఉంటున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. భారత్ లో విరివిగా దొరికే టాప్ బ్రాండ్ శానిటరీ ప్యాడ్స్ లో ఈ కెమికల్స్ ను భారీ స్థాయిలో వినియోగిస్తున్నట్లు తేలింది. వీటితో అమ్మాయిలకు క్యాన్సర్, ప్రెగ్నెన్సీ రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ప్రతీ నలుగురు టీనేజీ యువతుల్లో ముగ్గురు ఈ శానిటరీ ప్యాడ్స్ ను వాడుతున్నట్లు పేర్కొంది. ‘వీటిల్లో అత్యధిక మోతాదుల్లో కార్సినోజెన్స్, రీ ప్రొడక్టివ్ టాక్సిన్స్, ఎండోక్రైన్ డిస్ రప్టర్స్, అలెర్జెన్స్ వంటి కెమిక్సల్ ను వాడేస్తున్నారు’ అంటూ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది.