కెటిఆర్​: హైదరాబాద్​కు వరదలు రావని చెప్పను

By udayam on June 3rd / 11:15 am IST

ఈ ఏడాది వర్షాకాలంలో హైదరాబాద్​లో వరదలు రావన్న గ్యారెంటీ తాను ఇవ్వలేనని పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్​ అన్నారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ 2021-2022 వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గతేడాది, అంతకు ముందు ఏడాది వచ్చిన వరదలతో పోల్చితే ఈసారి హైదరాబాద్​ నగరం కాస్త కోలుకుంటుంది. అయితే ఈ వర్షాకాలంలో నగరంలో వరదలు రావని మాత్రం నేను చెప్పను. గతంతో పోల్చితే కాస్త తగ్గుముఖం పడుతుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​