శివ చౌహాన్​: సియాచిన్​ యుద్ధ క్షేత్రంలో బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా కెప్టెన్​

By udayam on January 4th / 6:42 am IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్​ లో అరుదైన ఘట్టం ఆవిష్కరించింది. ఈ కఠినమైన యుద్ధ క్షేత్రంలో బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఆఫీసర్​ గా కెప్టెన్​ శివ చౌహాన్​ రికార్డులకెక్కారు. ఇండియన్​ ఆర్మీకి చెందిన ఫైర్​ అండ్​ ఫూరీ కార్ప్స్​ కు చెందిన శివ చౌహాన్​ సియాచిన్​ వద్ద రక్షణ బాధ్యతలు చేపట్టడానికి ముందు సియాచిన్​ బాటిల్​ స్కూల్​ వద్ద ఇతర అధికారులతో కలిసి శిక్షణలో పాల్గొన్నారు. ఏడాదంతా దట్టమైన మంచుతో కప్పబడి ఉండే ఈ యుద్ధ క్షేత్రంలో విధులు నిర్వర్తించడం అంత ఆషామాషీ కాదు.

ట్యాగ్స్​