తన వ్యాపార సామ్రాజ్య వృద్ధికి, రాజకీయాలకు సంబంధం లేదంటున్నారు బిలియనీర్ గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్ ప్రయాణం మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభమైందని అదానీ చెప్పారు. ‘ప్రధాని మోదీ, నేను ఒకే రాష్ట్రానికి చెందినవాళ్ళం. అందుకే అలాంటి నిరాధారమైన ఆరోపణలకు నన్ను సులభంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఇలాంటి కథనాలు నాపై మోపడం దురదృష్టకరం’ అని ఓ ఆంగ్ల టీవీకి వచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ అన్నారు.