4:38 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

కంగనా పై దేశ ద్రోహం కేసు 2 weeks ago

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ మృతిపై మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్న సమయంలో ప్రజల్లో అనుమానాలు కలిగేలా వివాదస్పద వ్యాఖ్యలతోపాటు, ముంబైని పాక్‌ అక్రమిత కశ్మీర్‌గా పోలుస్తూ టాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే. దీనిపై అప్పట్లో శివసేన గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మహారాష్ట్ర సర్కారుపై ఢీ అంటే ఢీ అంటూ సంచలనంగా మారిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ వచ్చింది.

అంతేకాకుండా ముంబై పోలీసులను బాబర్స్ అంటూ కంగన పోల్చడం పెను దుమారం రేపింది. అయితే ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ​ అభ్యంతరకర ట్వీట్​ చేసిందని కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ ​ కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయస్థానం ఆమెపై కేసు నమోదు చేయాలని అదేశించింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.