అంతర్జాతీయం

పాపులర్ వార్తలు

 • గ్రీన్​ ఎనర్జీపై భారత్​ వెంటే అమెరికా

  3 days ago

  భారత్​ 2030 నాటికి 450 గిగావాట్ల గ్రీన్​ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని నిర్ధేశించుకున్న లక్ష్యానికి తమ దేశం సంపూర్ణ సహకారం అందిస్తున్న అమెరికా అధ్యక్షుడి ప్రధాన సలహాదారు జాన్​ కెర్రీ అన్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి భారత్​కు కావాల్సిన అంతర్జాతీయ ఫండింగ్​ విషయంలో అమెరికా మీ వెంటే ఉంటుందని ఆయన (ఇంకా చదవండి)

 • మా దేశంలో ఒక్క కరోనా కేసూ లేదు :

  3 days ago

  తమ దేశంలో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని ఉత్తర కొరియా ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 23,121 మందికి కరోనా పరీక్షలు జరిపినప్పటికీ ఎవరికీ పాజిటివ్​గా తేలలేదని వెల్లడించింది. అన్ని పరీక్షలూ నెగిటివ్​గానే వచ్చిందని తెలిపింది. అయితే విదేశీయులు ఎవరూ తమ దేశంలోకి రాకుండా (ఇంకా చదవండి)

 • న్యూక్లియర్​ టార్పెడోను పరీక్షించిన రష్యా

  3 days ago

  అమెరికా కోస్టల్​ తీరానికి రేడియో యాక్టివ్​ సునామీలను పంపగల న్యూక్లియర్​ టార్పిడోను రష్యా ఈరోజు ఆర్కిటిక్​ లో ప్రయోగించింది. ఈ పరీక్షలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నామని చెప్పింది. అయితే రష్యా మాత్రం తమ శత్రుదేశాల నుంచి దేశాన్ని రక్షించడానికి ఈ ఆయుధాన్ని ఆర్కిటిక్​లోని తమ (ఇంకా చదవండి)

 • షేర్​చాట్​ వాల్యూ @ 2.1 బిలియన్​

  3 days ago

  దేశీయ సోషల్​ మీడియా యాప్​ షేర్​ చాట్​ గురువారం తన వాల్యూను 2.1 బిలియన్​ డాలర్లకు పెంచుకుంది. సిరీస్​ ఈ ఫైనాన్స్​ రౌండ్​ ద్వారా ఇన్వెస్టర్ల వద్ద నుంచి 502 మిలియన్​ డాలర్లు వసూలు చేసిన షేర్​ చాట్​ తన మార్కెట్​ వాల్యూను రూ.15 వేల కోట్లకు పెంచుకుంది. గతేడాది (ఇంకా చదవండి)

 • ఫేస్​బుక్​, ఇన్​స్టాలను దాటేసిన యూట్యూబ్​

  4 days ago

  గూగుల్​కు చెందిన యూట్యూబ్​ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన సోషల్​ మీడియా సైట్​గా నిలిచింది. 81 శాతం మంది యూట్యూబ్​ను వాడుతుండగా ఫేస్​బుక్​ను 69 శాతం మంది ఇన్​స్టాగ్రామ్​ను 40 శాతం మాత్రమే వాడుతున్నట్లు ప్యూ రీసెర్చ్​ సెంటర్​ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 31 శాతం మంది యూజర్లతో పిన్​టరెస్ట్​ (ఇంకా చదవండి)

 • వెంటనే వెనక్కి తగ్గండి : అమెరికా

  4 days ago

  చైనా తన సైనిక బలగాన్ని ఫిలిప్పీన్స్​కు చెందిన సముద్ర జలాల్లోకి, తైవాన్​కు చెందిన ఎయిర్​ డిఫెన్స్​ జోన్​కు పంపడాన్ని అమెరికా తప్పుబట్టింది. తక్షణం సైన్యాన్ని వెనక్కి పిలవాలని డిమాండ్​ చేసింది. తమ మిత్ర దేశాలైన ఫిలిప్పీన్స్​, తైవాన్​లతో మాకు ఉన్న అగ్రిమెంట్​ ప్రకారం వారిపై దాడికి ప్రయత్నిస్తే తమ నుంచి (ఇంకా చదవండి)

 • మరోసారి రక్తసిక్తమైన మయన్మార్​

  4 days ago

  మయన్మార్​ సైనిక ప్రభుత్వం అక్కడి ప్రజలపై ఈరోజు మరోసారి తూటాల వర్షం కురిపించింది. దీంతో 11 మంది నిరసనకారులు మరణించారు. మయన్మార్​కు దక్షిణ ప్రాంతంలోని టాజే పట్టణంలో ఈ కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మొత్తం 12 ట్రక్కుల్లో వచ్చిన ఆర్మీ సిబ్బంది నిరసనకారులపై కాల్పులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. (ఇంకా చదవండి)

 • ఇరాన్​పై ఆంక్షల్ని ఎత్తేయనున్న అమెరికా

  4 days ago

  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇరాన్​పై విధించిన ఆంక్షల్ని అమెరికా ఎత్తేయనుంది! తమతో కుదుర్చుకున్న న్యూక్లియర్​ డీల్​కు కట్టుబడి ఉండడానికి ఇరాన్​ సిద్ధమైతే ఆ దేశంపై విధించిన ఆంక్షలన్నింటినీ తొలగిస్తామని వైట్​హౌస్​ బుధవారం ప్రకటించింది. దాంతో పాటు ఈ న్యూక్లియర్​ డీల్​లోకి తిరిగి అమెరికా చేరుతుందని సైతం అమెరికా (ఇంకా చదవండి)

 • చైనా వ్యాక్సిన్​కు శ్రీలంక బ్రేకులు

  4 days ago

  గతవారం చైనా నుంచి శ్రీలంకకు అందిన 6 లక్షల కొవిడ్​ వ్యాక్సిన్​ వాడకాన్ని శ్రీలంక నిలిపి వేసింది. తమ దేశంలో ఉంటున్న చైనా దేశస్థులకు మాత్రమే ఈ సినోఫామ్​ అనే చైనా వ్యాక్సిన్​ను ఇవ్వాలని ఆ దేశ హెల్త్​ రెగ్యులేటరీ సంస్థ నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్​ తమ దేశ పౌరులపై (ఇంకా చదవండి)