జాతీయం

పాపులర్ వార్తలు

 • బ్యాడ్మింటన్​ దిగ్గజం నాటేకర్​ మృతి

  9 hours ago

  భారత బ్యాడ్మింటన్​ దిగ్గజం నందు నాటేకర్​ (88) ఈరోజు వృద్ధాప్య సమస్యలో మృతిచెందారు. ఆయన. భారత్​కు 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిళ్ళను సాధించిపెట్టారు 1950–70 దశకాల మధ్య ఆయ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. భారత్​కు తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్​ పతకం అందించిన ఘనత (ఇంకా చదవండి)

 • 5 గురు మృతి, 25 మంది గల్లంతు

  11 hours ago

  జమ్మూ కాశ్మీర్​లోని చీనాబ్​ వ్యాలీలో కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. ఈ వరదల్లో 5 గురు మరణించగా, 25 మంది ఆచూకీ గల్లంతైంది. చీనాబ్​ వాలీలోని కిష్​త్వార్​ ప్రాంతంలో ఉన్న డచ్చన్​ వద్ద వీరంతా గల్లంతయ్యారు. 5 గురి మృతదేహాలు లభ్యం కాగా గల్లంతైన వారి కోసం (ఇంకా చదవండి)

 • పేటిఎంలో 20 వేల ఉద్యోగాలు

  11 hours ago

  భారత దిగ్గజ ఫిన్​టెక్​ కంపెనీ పేటిఎం 20 వేల మంది ఉద్యోగులను సేల్స్​ ఎగ్జిక్యూటివ్స్​గా తీసుకోవడానికి సిద్ధమవుతోంది. భారీ ఐపిఓకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్న ఈ కంపెనీ తాజాగా ఉద్యోగ నియామకంపై దృస్టిపెట్టింది. ఈ ఉద్యోగాల కింద రూ.35 వేల జీతాన్ని పేటిఎం ఆఫర్​ చేస్తోంది. పేటిఎం ఎకో సిస్టమ్​లో భాగమైన (ఇంకా చదవండి)

 • భారీగా కేసులు, మరణాలు

  11 hours ago

  భారత్​లో కరోనా వైరస్​ విజృంభన కొనసాగుతోంది. తాజాగా 43,654 మందికి పాజిటివ్​గా తేలింది. దాంతో పాటు 640 మంది ఈ వైరస్​తో మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.14 కోట్లకు చేరగా, మరణాల సంఖ్య 4.22 లక్షలను దాటాయి. ప్రస్తుతం భారత్​లో 3,99,436 (ఇంకా చదవండి)

 • ప్రమాణం చేసిన బసవరాజ్​

  11 hours ago

  కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి కొలువు దీరారు. నిన్న సాయంత్రం ఆ రాష్ట్ర బిజెపి కోర్​ కమిటీ ఎన్నుకున్న బసవరాజ్​ బొమ్మై ఈరోజు ఉదయం 11 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్​, కిషన్​ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని (ఇంకా చదవండి)

 • 15 రోజులు బ్యాంకులకు సెలవ్​

  12 hours ago

  దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకు వచ్చే నెలలో దాదాపు 15 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆగస్ట్​ 1, 8, 14, 15, 22. 28. 29 తేదీల్లో ఆదివారాలు, రెండు, 4వ శనివారాల సాధారణ సెలవులు వస్తుననాయి. దాంతో పాటు 13, 16, 19, 20. 21. (ఇంకా చదవండి)

 • ధోలవిరాకు యునెస్కో గుర్తింపు

  13 hours ago

  హరప్పా నాగరికతకు చెందిన ప్రత్యేక కట్టడం ధోలవిరా ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. గుజరాత్​లోని కచ్​ జిల్లాలో ఉన్న ఈ 5 వేల సంవత్సరాల పాత నగరం ధోలవిరాను 1967–68 లలో జేపీ జోషీ ఆధ్వర్యంలో పురావస్తు శాఖ గుర్తించింది. హరప్పా నాగరికతలోని 8 ప్రముఖ ప్రాంతాల్లో (ఇంకా చదవండి)

 • కర్ణాటక సిఎంగా బసవరాజు

  1 day ago

  యడియూరప్ప రాజీనామాతో ఖాళీ అయిన కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని హగ్గావి ఎమ్మెల్యే బసవరాజు బొమ్మై కైవసం చేసుకున్నారు. తీవ్ర పోటీ నెలకొన్న ఈ పదవి కోసం బసవరాజునే ఆ రాష్ట్ర శాసనసభా పక్షం ఎంపిక చేసింది. బొమ్మై ప్రస్తుతం కర్ణాటకలో హోం, న్యాయ శాఖలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాలను చూస్తున్నారు. (ఇంకా చదవండి)

 • వచ్చే ఏడాదే గగన్​యాన్​ : ఇస్రో

  1 day ago

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గగన్​యాన్​ యాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఈ ఏడాది డిసెంబర్​లోనే తొలి గగన్​యాన్​ యాత్ర చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం కరోనా కారణంగా పలు అవాంతరాలు ఎదురవుతుండడంతో ఈ పరీక్షల్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ఇస్రో ఛైర్మన్​ (ఇంకా చదవండి)