జిఒ -1పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీల రోడ్ షోలు, సభలపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జిఒ నెంబరు 1ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రహదారులపై బహిరంగ సమావేశాలు (ఇంకా చదవండి)
ఎపిఎస్‌ఆర్‌టిసి సంక్రాంతి పండుగకు రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. తిరుగు ప్రయాణంతో సంబంధం లేకుండా కేవలం ఈ నెల 6 నుండి 14 వరకు ఆర్‌టిసి రూ.141 కోట్ల ఆదాయాన్ని పొందింది. సంక్రాంతికి ముందు రోజుల్లో సాధారణ ఛార్జీలతోనే 3,120 బస్సులను నడపాలని తొలుత ఆర్‌టిసి నిర్ణయించింది. అయితే టిఎస్‌ఆర్‌టిసి, (ఇంకా చదవండి)
సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. ఈరోజు నుండి స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ఇవ్వడం తో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో అన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈనేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా (ఇంకా చదవండి)
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంపై ఏపీ సిఎం జగన్ చేసిన ట్వీట్ వివాదం రేపుతోంది. ఆర్ఆర్ఆర్ టీం కు శుభాకాంక్షలు చెబుతూ ‘తెలుగు జెండా పై పైకి ఎగురుతోంది. ఆంధ్రప్రదేశ్ తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. (ఇంకా చదవండి)
ఈనెల 19న ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు ఆకతాయిలు రాళ్ళతో దాడి చేశారు. దీంతో రెండు భోగీల అద్దాలు బద్దలయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్ల దాడేనని వాల్తేరు (ఇంకా చదవండి)
పొద్దున్న లేచింది మొదలు ప్రజలపై పన్నుల భారంతో విరుచుకుపడే ప్రభుత్వాలు.. తాజాగా మరోసారి అదే దారిని ఎంచుకున్నాయి. త్రైమాసిక రోడ్‌ట్యాక్స్‌ను భారిగా పెంచుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారం సగటున 30శాతంపైనే ఉన్నట్లు వాహన యజమానులు చెబుతున్నారు. 6 టైర్ల లారీలకు రూ 3,940లుగా వున్న (ఇంకా చదవండి)
తెలంగాణ సర్వీసు నుంచి ఆంధ్రప్రదేశ్ కు రిలీవ్ అయిన సీనియర్ ఐఎఎస్ సోమేశ్ కుమార్ గురువారం ఉదయం 11గంటలకు సిఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి బయల్దేరారు. డివోపిటి ఆదేశాల మేరకు ఎపి సర్వీసులో జాయిన్ అవుతున్నానీ గురువారం ఉదయం తెలిపారు. సిఎం (ఇంకా చదవండి)
పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యపై శుక్రవారం కీలకభేటీ జరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు, పర్యావరణ అనుమతులను ఏపీ పాటించడంలేదని తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ లు సుప్రీంను ఆశ్రయించాయి. దీంతో సుప్రీం పోలవరం బాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించి పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని కేంద్ర జలసంఘాన్ని గత ఏడాది సెప్టంబర్‌లో ఆదేశించింది. (ఇంకా చదవండి)
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపటి క్రితం ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను కూడా స్వీకరించారు. సీఎస్ (ఇంకా చదవండి)