టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మంగళగిరి (ఇంకా చదవండి)
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై వరుస దాడులు చేస్తున్న ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలను తనకు ఒక్కరోజుకు ఇస్తే సగం మంది బిజెపి నేతలు జైల్లోనే ఉంటారని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ.. అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయన్న ఆయన.. మా మంత్రి మనీష్ సిసోడియా.. (ఇంకా చదవండి)
రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. తన ప్రత్యర్థి సచిన్‌పైలెట్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ విరుచుకుపడ్డారు. గురువారం జాతీయ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలో.. సచిన్ ను ద్రోహిగా అభివర్ణించారు. పది మంది ఎమ్మెల్యేలు కూడా లేని వారిని, తిరుగుబాటుదారుడైన సచిన్‌పైలెట్‌ని కాంగ్రెస్ అధిష్టానం సిఎంగా నియమించదని అన్నారు. (ఇంకా చదవండి)
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పత్తిపాడు గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీనియర్ నాయకుడినైన నన్ను, నా భార్యను అసెంబ్లీలో (ఇంకా చదవండి)
గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నామినేషన్ వేసిన ఓ అభ్యర్ధి నిన్న కిడ్నాప్ అయ్యాడు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆప్ నాయకుడు సిసోడియా.. బిజెపినే టార్గెట్ చేస్తూ.. కమలం శ్రేణులే మా అభ్యర్ధి కంచన్ జరివాలాను కిడ్నాప్ చేసి, నామినేషన్ వెనక్కి (ఇంకా చదవండి)
ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఎంపి శశి థరూర్ ను ఆ పార్టీ పూర్తిగా పక్కన పెట్టేయనుంది! గుజరాత్ లో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ లో అతడికి చోటు దక్కలేదు. దీంతో ఆయన ఆ రాష్ట్రంలో జరిగే (ఇంకా చదవండి)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బుధవారం నాడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. తనపై భారం తొలగిపోయినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. ‘నాకు ఊరటగా ఉందని చెప్పాను. దీనిపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాపట్ల చాలా ఏళ్లుగా (ఇంకా చదవండి)
రాజకీయ పార్టీ పెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె)కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఆయన పాదయాత్రలో భాగంగా జరిపిన బహిరంగ సభకు కనీసం 500ల మంది కూడా హాజరు కాలేదు. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో జరిగిన సభలో (ఇంకా చదవండి)
మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. 15న (ఇంకా చదవండి)